జీఎస్‌‌టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లు

జీఎస్‌‌టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: కిందటి నెలలో  ప్రభుత్వానికి రూ.1.96 లక్షల కోట్ల జీఎస్‌‌టీ రెవెన్యూ వచ్చింది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడంతో కిందటేడాది జనవరితో పోలిస్తే 12.3 శాతం పెరిగింది. ఇండియాలో అమ్మిన గూడ్స్‌‌, సర్వీస్‌‌ల ద్వారా వచ్చిన జీఎస్‌‌టీ రెవెన్యూ 10.4 శాతం వృద్ధి చెందింది. రూ.1.47 లక్షల కోట్లకు పెరిగింది. అదే దిగుమతులపై వేసిన జీఎస్‌‌టీ ద్వారా రూ.48,382 కోట్లు రాగా, ఏడాది ప్రాతిపదికన 19.8 శాతం వృద్ది నమోదైంది. 

మొత్తంగా  ఈ ఏడాది జనవరిలో రూ.1,95,506 కోట్ల జీఎస్‌‌టీ రెవెన్యూ (గ్రాస్‌‌) వచ్చింది. కిందటేడాది డిసెంబర్‌‌‌‌లో రూ. 1.77 లక్షల కోట్ల జీఎస్‌‌టీ (గ్రాస్‌‌) వసూళ్లయ్యింది.  కిందటి నెలలో వచ్చిన జీఎస్‌‌టీ రెవెన్యూలో రూ.36,100 కోట్లు సెంట్రల్ జీఎస్‌‌టీ కింద, రూ.44,900 కోట్లు స్టేట్‌‌ జీఎస్‌‌టీ కింద,  రూ.1.01 లక్షల కోట్లు  ఇంటిగ్రేటెడ్ జీఎస్‌‌టీ కింద, రూ.13,400 కోట్ల సెస్ కింద  వచ్చాయి.   ప్రభుత్వం రూ.23,853 కోట్ల రిఫండ్స్‌‌  జరిపింది. 

నెట్ జీఎస్‌‌టీ వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి.  తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌‌, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్‌లో జీఎస్‌‌టీ వసూళ్లు 10– 20 శాతం మేర, హర్యానా, కర్నాటక, రాజస్థాన్‌‌, మధ్యప్రదేశ్‌‌, పంజాబ్‌‌, వెస్ట్ బెంగాల్‌లో 5–9 శాతం పెరిగాయి.