అసంపూర్తిగా ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్

  • కొత్త ట్యాక్సులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఎజెండాలోని 15 అంశాల్లో కేవలం 8 అంశాలపై మాత్రమే చర్చించినట్లు చెప్పారు. క్యాసినో, రేస్ కోర్స్, ఆన్ లైన్ గేమింగ్ తదితరాలపై పన్ను విధించడంపై చర్చ జరగలేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు..

సమయాభావం వల్ల అప్పీలేట్ ట్రైబ్యునళ్ల ఏర్పాటు, పాన్ మసాలా, గుట్కా వ్యాపారంలో పన్ను ఎగవేతను అడ్డుకోవడంపై చర్చ జరగలేదని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అలాగే కొత్త ట్యాక్సులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మరోవైపు కొన్ని నేరాలను డీ క్రిమినలైజ్ చేస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా తెలిపారు.