న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) 53వ కౌన్సిల్ సమావేశం శనివారం( జూన్ 22) న జరగనుంది. గతే డాది అక్టోబర్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఆన్ లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపుపందేలపై 28 శాతం లెవీ విధించాలని కౌన్సిల్ నిర్ణయించింది. తర్వాత ఆన్ లైన్ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయంపై విధించిన 28 శాతం లెవీపై సమీక్షను కౌన్సిల్ వాయిదా వేసింది.
అయితే ఇవాళ జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సహజ వాయివు, విమానయాన టర్బైన్ ఇంధనాన్ని GST పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనలతోపాటు ఆన్ లైన్ గేమింగ్ పై 28 శాతం పన్నుపై సమీక్షించనున్నారు.