పాప్ కార్న్ పై జీఎస్టీ నిర్ణయం ఒకవైపు వినియోగదారుల ఆగ్రహానికి కారణమైతే.. మరోవైపు హాస్యాస్పదం అయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ‘పాప్ కార్న్ మీమ్స్’ నడుస్తున్నాయి. వివిధ స్లాబులలో పాప్ కార్న్ పై జీఎస్టీ విధించిన సంగతి తెలిసిందే. పాప్ కార్న్ పై జీఎస్టీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని, తగ్గించాలని అభ్యర్థనలు వచ్చాయి. జీఎస్టీ కౌన్సిల్ 55వ మీటింగ్ లో దీనిపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్. సాల్టెడ్ పాప్ కార్న్, ప్యాకేజ్ డ్ పాప్ కార్న్ కంటే కారమెల్ పాప్ కార్న్ పై జీఎస్టీ ఎక్కువ విధించారు. దీనిపై స్పందిస్తూ కారమెల్ పాప్ కార్న్ లో యాడెడ్ షుగర్స్ ఉండటం వలన.. ఇది మిఠాయిల విభాగంలోకి వస్తుందని, అందుకే జీఎస్టీ ఎక్కువగా వేసినట్లు తెలిపారు. వివిధ పాప్ కార్న్ లపై జీఎస్టీ ఈ కింది విధంగా ఉంది.
- ప్యాక్ చేయని, లేబుల్ లేనటువంటి పాప్ కార్న్ : 5% GST
- ప్యాక్ చేసిన, లేబుల్ ఉండి రెడీ టు ఈట్ పాప్ కార్న్: 12% GST
- క్యారమెలైజ్డ్ పాప్ కార్న్ (షుగర్ ఉన్నటువంటివి): 18% GST
జీఎస్టీపై మీమ్సే మీమ్స్..
అయితే మంత్రి నిర్మలాసీతారామన్ వివరణ తర్వాత జీఎస్టీపై మీమ్స్ జోరందుకున్నాయి. సరదాగా థియేటర్ కు వెళ్లినపుడు టైమ్ పాస్ కు తినే పాప్ కార్న్ పై ఇంత జీఎస్టీ విధిస్తారా.. అని కాస్త కామెడీ జోడించి సోషల్ మీడియాలో మీమ్స్ వదులుతున్నారు.
సాల్ట్ పాప్ కార్న్ కు 5 శాతం, కారమెల్ పాప్ కార్న్ కు 18 శాతం జీఎస్టీ విధిస్తే.. మరి ఫ్లేవర్ కు ఎంత జీఎస్టీ విధిస్తారని ఈ మీమ్ వైరల్ అయ్యింది.
ఈ మీమ్ చూడండి.. పాప్ కార్న్ తింటే ట్యాక్స్ కట్టాలి.. బైక్ కొన్నావా.. ట్యాక్స్ కట్టు.. భోజనం చేశావా.. ట్యాక్స్ కట్టు.. జీవించాలంటే .. ట్యాక్స్ కట్టాల్సిందే దీని మీనింగ్.
వీటన్నింటికంటే అల్టిమేట్ కామెడీ మీమ్ ఏంటంటే.. విడివిడిగా ఉంటే జీఎస్టీ వేస్తు్న్నారు కదా.. అయితే సాల్టెడ్, ప్యాకేజ్డ్, క్యారమెల్.. అన్నీ కలిపి మిక్సింగ్ చేసుకొని తింటాం..ఇప్పుడు వేయండి ట్యాక్స్.. చూద్దాం ఎలా వేస్తారో అని ఒక మీమ్ పోస్ట్ చేశారు. ఈ మీమ్ అయితే తెగ వైరల్ అయ్యిందనుకోండి.
Also Read :- కలెక్టర్ల సదస్సులో రెండు రోజుల భోజనం ఖర్చు రూ. 1.2 కోట్లా..
ఇక ఈ మీమ్ చూడండి.. సాల్ట్.. ప్యాకేజ్డ్, క్యారమెల్ కలిపిన పాప్ కార్న్ థియేటర్ లో కొన్నాను.. దీని ప్రకారం నాకు ఎంత జీఎస్టీ పడుతుందనే అర్థం లో భలే వైరల్ అయ్యింది ఈ మీమ్. తెలుగులో చదవడం కాదు కానీ.. మీకు కొంచెం హిందీ.. ఇంగ్లీష్ వస్తే.. ఆ మీమ్స్ చదవండి.. మస్త్ ఫన్ అనిపిస్తాయి.
మరో ఇంట్రెస్టింగ్ మీమ్ .. ‘‘క్యారమెల్, ప్యాకేజ్ డ్ పాప్ కార్న్ తినకుండా కేవలం సాల్ట్ పాప్ కార్న తినండి. తక్కువ జీఎస్టీ ఉంటుంది కదా. అలా డబ్బులు ఆదా చేసుకోండి. ఆ డబ్బుని మ్యుచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి. 30 ఏండ్ల తర్వాత మీ నెట్ వర్త ఎంత ఉంటుందో చూడండి’’ అని రాసిన ఈ మీమ్ కూడా ఫైనాన్షియల్ మార్కెట్ గురించి తెలిసిన వారికి భలే నవ్వు తెప్పించిందట. అందుకే సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేశారు.