లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీఎస్టీ అధికారి

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీఎస్టీ అధికారి

సీజ్ చేసిన ఒరిజినల్ ఇన్వాయిస్ పేపర్లు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశాడు ఓ జీఎస్టీ అధికారి. బాధితుడు ఏసీబీ అధికారులు ఆశ్రయించడంతో ఆ అధికారిని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు  హైదరాబాద్ సిటీ రేంజ్ ఇంచార్జ్ డిఎస్పీ ప్రతాప్ తెలిపిన వివరాల మేరకు…ఈ నెల 6న ముంబై నుండి హైద్రాబాద్  శ్రీ కృష్ణ ట్రేడర్స్ కు బాదం లోడ్ తో వస్తున్న ఓం ట్రాన్స్ పోర్ట్ లారీని స్టేట్ టాక్స్ అధికారులు అడ్డుకున్నారు. లోడ్ వాల్యూకు సరైన పత్రాలు లేవంటూ మెహదీపట్నం పిల్లర్ నెం.53 వద్ద సీజ్ చేశారు. దీనితో ట్రాన్స్ పోర్ట్ మేనేజర్ దినేష్ లోడ్ కు సంబందించిన పత్రాలు సరైనవేనని అధికారులకు తెలపడంతో లారీని విడుదల చేశారు.

అయితే స్టేట్ టాక్స్ ఆఫీసర్ కె.బిక్షమయ్య మాత్రం లోడ్ కు సంబందించిన ఒరిజినల్ ఇన్వాయిస్ పేపర్లు ఇచ్చేందుకు దినేష్ నుంచి రూ.60 వేలు డిమాండ్ చేశాడు.  ఆ డబ్బు ఇస్తేనే పేపర్లు ఇస్తానని అతన్ని బెదిరించాడు. తాను అంతా డబ్బులు ఇవ్వలేనని దినేష్ చెప్పడంతో రూ.35 వేలు అయినా ఇవ్వాలని ఒత్తిడి చేశాడు బిక్షమయ్య. డబ్బులు ఇచ్చేందుకు ఇష్టం లేని దినేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.  గురువారం నాంపల్లి లోని గగన్ విహార్ భవనం మొదటి అంతస్తులోని కార్యాలయంలో బిక్షమయ్య దినేష్ నుంచి రూ.35 వేలు డబ్బులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు.  అనంతరం అరెస్ట్ చేసి, ఏసీబీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు డిఎస్పీ ప్రతాప్ తెలిపారు.

GST officer accept Rs.35,000 bribe, caught red-handed by ACB officers