
GST దెబ్బకు ఆన్ గేమింగ్ కంపెనీలు చచ్చిపోతున్నాయి. ఆన్ లైన్ రియల్ మనీ గేమ్ లపై GST దెబ్బ గట్టగానే పడింది. 28 శాతం GST పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో గేమింగ్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపింది. GST కౌన్సిల్ నిర్ణయం తర్వాత మూడు స్టార్టప్ కంపెనీలు సిబ్బందిని తొలగించగా.. తాజా మరో మూడు స్టార్టప్ కంపెనీలు మూతపడ్డాయి.
మొదట ఈ ప్రభావం మొబైల్ ప్రీమియర్ లీగ్ (MPL) పీక్ XV పార్ట్‌నర్స్ ఫండెడ్ కంపెనీపై గట్టగానే పడింది. జీఎస్టీ దెబ్బకు ఈ కంపెనీ 350 మంది ఉద్యోగులను తొలగించింది. జీఎస్టీ కారణంగా పన్ను భారం భారీగా పెరగడంతో ఉద్యోగుల తొలగింపులకు కారణమయిందని కంపెనీ పేర్కొంది.
MPL తర్వాత.. ఆన్‌లైన్ పోకర్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ ‘‘స్పార్టన్ పోకర్’’ 125 మంది ఉద్యోగులను తొలగించింది. కవిన్ భారతి మిట్టల్ నేతృత్వంలోని హైక్ రష్ గేమింగ్ యూనివర్స్ కూడా 55 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందించింది. జీఎస్టీపెరుగుదలే ఇందుకు కారణమని హైక్ సీఈవో మిట్టల్ తెలిపారు. ఈ మూడు కంపెనీల్లో దాదాపు 500 మంది ఉద్యోగులు తొలగించబడ్డారు. జీఎస్టీ దెబ్బకు ప్రారంభ దశలో ఉన్న మూడు కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. రియల్ మనీ గేమింగ్ యాప్ ఫాంటోక్, క్రిప్టో గేమింగ్ యాప్ వన్ వరల్డ్ నేషన్ (OWN) తమ సేవను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఇంకా లేఆఫ్స్ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో గేమింగ్ స్టార్టప్ క్విజీ తన కార్యకలాపాలను శాశ్వతంగా మూసివేసింది. ఈ సంస్థలు ఇక కోలుకోవడం కష్టమేనని పరిశ్రమల నిపుణులు అంటున్నారు.