టెక్స్‌టైల్‌పై జీఎస్టీ రేటును యధావిధిగా కొనసాగించనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. టెక్స్‌టైల్‌పై ఇప్పుడున్న జీఎస్టీ రేటు 5 శాతాన్ని అదేవిధంగా కొనసాగించాలని.. దానిని 12 శాతానికి పెంచొద్దని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. టెక్స్‌టైల్‌పై జీఎస్టీ రేటు అంశాన్ని పన్ను రేట్ల హేతుబద్ధీకరణ కమిటీకి పంపుతామని.. ఆ కమిటీ ఫిబ్రవరిలోగా తన నివేదికను సమర్పిస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన దేశ రాజధానిలో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ అత్యవసర సమావేశంలో వస్త్రాలపై జిఎస్‌టి రేటు యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో టెక్స్‌టైల్ సమస్య గురించి మాత్రమే చర్చించామని.. పాదరక్షలపై జీఎస్టీ పెంపు అంశం చర్చించలేదని ఆర్థిక మంత్రి తెలిపారు. సెప్టెంబరు 17న లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జౌళి, పాదరక్షల వస్తువులపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంపు నిర్ణయం జనవరి 1, 2022 నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ‘మేం జీఎస్టీపై యథాతథ స్థితిని కొనసాగిస్తున్నాం. జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచకూడదని నిర్ణయించాం’ అని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత మీడియా సమావేశంలో సీతారామన్ అన్నారు.
యూపీలోని కాన్పూర్ మరియు ఉన్నావ్‌లో సుగంధ పరిమళాల వ్యాపారుల ఆస్తులపై సోదాలకు సంబంధించిన ఆరోపణలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ‘సరైన ప్రదేశాల్లో దాడులు జరిగాయి. ఈ సోదాల వల్ల యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భయపడి, కదిలిపోయారా?’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
For More News..