GST పోర్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా పోర్టల్ సేవలు నిలిపివేసినట్లు ప్రకటించారు జనవరి 10 మధ్యాహ్నం 12 గంటలనుంచి రాత్రి 12 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవు. GST పోర్టల్ ద్వారా ట్యాక్స్ పేయర్స్, బిజినెస్ రిటర్న్స్ లు దాఖలు చేయడం,ఇన్ వాయిస్ రూపొందించడవం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తారు.
పోర్టల్ ద్వారా నిర్వహించే గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్ వర్క్ పనితీరును మెరుగు పర్చేందుకు , టెక్నికల్ లోపాలను పరిష్కరించేందుకు, కస్టమర్లు నిరంతర సేవలను అందించేదుకు సిస్టమ్ అప్డ్ గ్రేడ్ చేయడం కోసం తాత్కాలికంగా పోర్టల్ సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు
ALSO READ : జాబ్ చేసే మహిళల కోసం బెంగళూరు.. బెస్ట్ సిటీ
షెడ్యూల్ ప్రకారం.. వెబ్ సైట్ లో సేవలను అప్ గ్రేడ్ చేస్తు్న్నాం.. జనవరి 10, 2025 మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవు.ఏవైనా సందేహాలుంటే 1800 103 4786 కు కాల్ చేయాలని వెబ్ సైట్ లో అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ డౌన్‌టైమ్ సమయంలో ట్యాక్స్ పేయర్స్ సహకరించాలని కోరింది.