
న్యూఢిల్లీ: జీఎస్‌టీ రేట్లను త్వరలో తగ్గిస్తామని, ట్యాక్స్ స్లాబ్‌లను రేషనలైజ్ చేస్తామని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దేశ అవసరాలకు తగ్గట్టు జీఎస్‌టీ సవరణలు ఉండేలా చూస్తున్నామని తెలిపారు. ‘జీఎస్‌టీ అమల్లోకి తెచ్చాక వస్తువుల ధరలు పెరగలేదు. ఏ ప్రొడక్ట్‌ల రేట్లు పెరిగాయో చెప్పాలి’ అని విమర్శకులకు సవాలు విసిరారు.
మరోవైపు ముంబైలో నిర్వహిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాటినమ్ జూబ్లి సెలబ్రేషన్స్‌ను ఆమె ప్రారంభించారు. కస్టమర్లకు పర్సనలైజ్డ్ సర్వీస్‌లను అందివ్వాలంటే బ్యాంకులు ఇన్నొవేషన్లపై ఫోకస్ పెట్టాలన్నారు. 17 ఎస్‌బీఐ బ్రాంచులను, మహిళల కోసం తెచ్చిన 501 కస్టమర్ల సర్వీస్ పాయింట్లను వర్చువల్‌గా లాంచ్ చేశారు.