ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీ తగ్గించే యోచనలో కేంద్రం..?

ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీ తగ్గించే యోచనలో కేంద్రం..?

ఇన్సూరెన్స్ ఈ రోజుల్లో ఎంత ముఖ్యమో చెప్పనవసరం లేదు. ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు, లేదంటే కుటుంబ పెద్దకు అనుకోనిది ఏదైనా జరిగినప్పుడు ఇన్సూరెన్సులు కుటుంబానికి అండగా నిలుస్తాయని, కచ్చితంగా అందరూ తీసుకోవాలనే ప్రచారం ఎప్పుడూ వింటూనే ఉంటాం. కంపెనీల ప్రచారం అయినప్పటికీ అందులో వాస్తవం లేకపోలేదు. పెరుగుతున్న ఖర్చులకు మిడిల్ క్లాస్ జేబుల్లో సేవింగ్స్ అనేవి తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఇన్సూరెన్సే కుటుంబాన్ని ఆదుకుంటుందనేది వాస్తవం.
 
అయితే ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఎక్కువగా ఉండటం వలన చాలా మంది పాలసీలు తీసుకోవడం లేదు. కొందరు అవగాహన లేక కూడా తీసుకోవడం లేదు. అరకొర సంపాదనతో హై ప్రీమియం చెల్లించి భీమా పాలసీలు తీసుకునేందుకు సామాన్యులు సుముఖంగా ఉండరు. అలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పే యోచనలో కంపెనీలు, ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 

ALSO READ : 12 ఖనిజాల రాయల్టీ పెంచాం.. గనుల అన్వేషణలో ప్రైవేట్ రంగం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఇన్సూరెన్స్ పై జీఎస్టీ (GST) తగ్గించేందుకు కేంద్రం ఇటీవలే పలు ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ల (IRDAI) తో సమావేశం అయ్యింది. టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ తగ్గించేయోచనలో ఉన్నట్లు ఈ మీటింగ్ లో చర్చించింది. ఈ సమావేశంలో జీఎస్టీని 12 శాతానికి తగ్గించేందుకు అంగీకారం కుదిరింది. దీనికి IRDAI, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (DFS) కూడా అంగీరించినట్లు సమాచారం. 

ALSO READబంపర్ ఆఫర్.. రూ.11 లతో విమానంలో విదేశాలకు టూర్..హోళీ ఆఫర్..ఒక్కరోజే ఛాన్స్..

అయితే 12 శాతం జీఎస్టీ కి ఓకే చెప్పిన ఇన్సూరెన్స్ కంపెనీలు జీఎస్టీ తగ్గుదలతో వచ్చే లాభాన్ని కస్టమర్లకు బదిలీ చేసేందుకు అంగీకరించినట్లు సోర్సెస్ ద్వారా తెలిసింది. ముందుగా 5 శాతం జీఎస్టీ గురించి చర్చించినప్పటికీ, 5 శాతంతో కస్టమర్లకు బెనిఫిట్స్ పాస్ ఆన్ చేయలేమని చెప్పడంతో 12 శాతానికి అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. 

ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ పై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. 12 శాతానికి తగ్గిస్తే కేంద్రంపై 7 వేల కోట్ల భారం పడనుంది. ఫైనల్ అప్రూవల్ కోసం జీఎస్టీ కౌన్సిల్ కు తాజా ప్రపోజల్ ను పంపించారు. దీనికి ఆమోదం లభిస్తే ఇన్సూరెన్స్ తీసుకునేవారికి, ఇప్పటికే తీసుకున్నవారికి మేలు జరుగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు.