జీఎస్టీ కలెక్షన్లు @ రూ.1.77 లక్షల కోట్లు

జీఎస్టీ కలెక్షన్లు @ రూ.1.77 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: జీఎస్టీ రూపంలో కిందటి నెల రూ.1.77 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇందులో సెంట్రల్​ జీఎస్టీ రూ.32,836  కోట్లు కాగా, స్టేట్​జీఎస్టీ రూ.40,499 కోట్లు, ఇంటిగ్రేటెడ్​ జీఎస్టీ రూ.47,783 కోట్లు, సెస్​ రూ.11,471 కోట్లు ఉంది. అయితే 2023 డిసెంబరులో రూ.1.65 లక్షల కోట్లు వసూలయ్యాయి.

గత నెల డొమెస్టిక్​ ట్రాన్సాక్షన్లు 8.4 శాతం పెరగడంతో రూ.1.32 లక్షల కోట్లు, దిగుమతులపై విధించిన పన్నుల ద్వారా రూ.44,268 కోట్లు వచ్చాయి. నవంబరులో జీఎస్టీ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 8.5 శాతం పెరగడంతో రూ.1.82 లక్షల కోట్లు ఖజానాకు వచ్చాయి. గత ఏడాది ఏప్రిల్​లో అత్యధికంగా రూ.2.10 లక్షల కోట్లు వసూలయ్యాయి. గత డిసెంబరులో రూ.22,490 కోట్ల విలువైన రీఫండ్లు జారీ చేశారు. ఇవి ఏడాది లెక్కన 31 శాతం పెరిగాయి. వీటిని మినహాయిస్తే, నికర జీఎస్టీ వసూళ్ల  విలువ 3.3 శాతం పెరిగి రూ.1.54 లక్షల కోట్లు అవుతుంది.