ఐపీఎల్ చివరి దశకు వచ్చేసింది. ప్రతి జట్టుకు ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. ఇందులో భాగంగా నేడు మరో సూపర్ ఫైట్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. చెన్నై జట్టును పక్కనపెడితే గుజరాత్ కు ఈ మ్యాచ్ చావో రేవో లాంటిది.
ఈ మ్యాచ్ లో ఓడిపోతే గిల్ సేన టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయిన గుజరాత్ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తుంది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై వరుసగా రెండు ఘోర ఓటములు ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది. కెప్టెన్ గిల్ టోర్నీ ప్రారంభంలో అదరగొట్టినా.. ఆ తర్వాత బ్యాట్ ఝళిపించలేకపోతున్నాడు. సాయి సుదర్శన్ మినహాయిస్తే నిలకడగా ఆడే ఆడే ఆటగాళ్లు ఎవరూ లేరు. ఇక బౌలింగ్ లో అందరూ విఫలమవుతుంటే.. ఆదుకుంటాడుకుంటాడనుకున్న రషీద్ ఖాన్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు.
ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడితే 4 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన మూడు మ్యాచ్ ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మరో వైపు చెన్నై సూపర్ ఫామ్ లో ఉంది. ఆడిన 11 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించింది. మరో మూడు మ్యాచ్ ల్లో రెండు గెలిచినా ప్లే బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఈ మ్యాచ్ లోనే గెలిచి ప్లే ఆఫ్ కు చేరువవ్వాలని భావిస్తుంది. మరి ఏ జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తుందో చూడాలి.
GT vs CSK#gt #sck #chennaisuperkings #gujrattitans pic.twitter.com/HQbCrgCjPx
— RVCJ Sports (@RVCJ_Sports) May 10, 2024