భారత యువ క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కంట్రోల్ తప్పాడు. ఐపీఎల్ మ్యాచ్ తిలకించడానికి స్టేడియానికి వచ్చిన ఓ మహిళా అభిమానిని చూసి నోరెళ్లబెట్టాడు. సదరు మహిళా అభిమాని అందంగా ఉండటమే అందుకు కారణం. 24 ఏళ్ల వయసు, ఉడుకు రక్తం.. ఆమాత్రం చూడడంలో తప్పేముంది అనకండి. కెప్టెన్సీ బాధ్యతలతో ఒక జట్టుకు నాయకుడిగా ఉన్నాడు. అవేం పనులు చెప్పండి. అందుకే అతని తీరుపై విమర్శలు వస్తున్నాయి.
స్టేడియానికి వచ్చిన మహిళా అభిమానుల్లో అందంగా ఉన్న వారిని కెమెరామెన్లు ఫోకస్ చేయడం కామన్. పదే పదే వారిని స్క్రీన్‌పై చూపిస్తుంటారు. ఓవర్ నైట్ స్టార్లను చేస్తుంటారు. అది పురుష అభిమానుల ఆనందం కోసం.. టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడం కోసం.. క్రికెటర్లు అలాంటివి చూసి దారి తప్పకూడదు. అందునా, గిల్.. భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారాతో ప్రేమలో మునిగి ఉన్నాడన్న వార్తలు వస్తున్నాయి. అలాంటిది ఒకరితో రిలేషన్ షిప్లో ఉండి.. ఇలాంటివి చేయకూడదన్నది అతనిపై వస్తున్న విమర్శలు. అయితే, కొందరు నెటిజెన్స్.. మన యువ క్రికెటర్ అమ్మాయిని చూసి అలా చేయలేదని వివరణ ఇస్తున్నారు. ఇంతకీ గిల్ చేసిన చిలిపి పనేంటో మీరూ చూడండి.
— Gems of Simps (@GemsOfSimps) April 17, 2024
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బుధవారం(ఏప్రిల్ 17) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాట్ టైటాన్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదట ఢిల్లీ బౌలర్లు విజృంభించడంతో గుజరాత్ 89 పరుగులకే కుప్పకూలగా.. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని రిషబ్ సేన 8.5 ఓవర్లలోనే చేధించింది.