సొంతగడ్డపై గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను మెరుగు పరుచుకోవాలన్న గుజరాత్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. వర్షం కారణంగా గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. దీంతో అంపైర్లు ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కీలక మ్యాచ్ రద్దవవడంతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుండి వైదొలిగింది.
పలుమార్లు వరుణుడు కనికరం చూపినప్పటికీ.. టాస్ వేసే అవకాశం కూడా ఇవ్వలేదు. తిరిగి వర్షం పుంజుకుంటూనే వచ్చింది. వర్షపు నీటిని బయటకు పంపడానికి మైదాన సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమించారు. మరోవైపు, పూర్తిగా స్థాయిలో వర్షం తగ్గకపోవడంతో అంపైర్లకు ఆటను నిలిపివేయడం తప్ప మరో దారి కనపడలేదు.
ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్.. ఐదింట విజయం సాధించింది. మరో ఆరింట ఓటమి పాలవ్వగా.. వర్షం కారణంగా నేడు జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. ప్రస్తుతానికి వీరి ఖాతాలో 11 పాయింట్లు ఉన్నాయి. లీగ్ దశలో వీరు ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సివున్నా.. అందులో విజయం సాధించినా 13 పాయింట్లు మాత్రమే చేరతాయి. ఇతర జట్లు 14 పాయింట్లు పైబడి సాధించేందుకు వీలు ఉండటంతో టైటాన్స్ టోర్నీ నుండి నిష్క్రమించింది. మరోవైపు, ఇప్పటికే తమ ప్లే ఆఫ్స్ బెర్త్ ను ఖాయం చేసుకున్న కోల్‌కతా అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
There will be no match today in Ahmedabad 🌧❌https://t.co/Vie8Wu1VT7 #IPL2024 #GTvKKR pic.twitter.com/uulrV6vTSI
— ESPNcricinfo (@ESPNcricinfo) May 13, 2024