భారత స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ మెరుపు ఫీల్డింగ్‌తో అలరించాడు. మైదానంలో తాను ఎంత చురుగ్గా ఉంటానో.. తన ఫీల్డింగ్‌లో ఎంత ఖచ్చితత్వం ఉంటుందో మరోసారి చూపించాడు. చిన్నస్వామి గడ్డపై గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ షారుఖ్ ఖాన్‌ను.. కోహ్లీ తన ఫీల్డింగ్ విన్యాసాలతో వెనక్కి పంపాడు.
ఏం జరిగిందంటే..?
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ ఆదిలోనే కష్టాల్లో పడింది. సిరాజ్ విజృంభణతో ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(1) శుభ్‌మన్ గిల్(2)లు పెవిలియన్ చేరారు. ఆపై కొద్దిసేపటికే సాయి సుదర్శన్(6)ను.. కామెరూన్ గ్రీన్ వెనక్కి పంపాడు. ఆ సమయంలో మిల్లర్(30)- షారుఖ్ ఖాన్(37) జట్టును ఆదుకున్నారు. ప్రమాదకరంగా మారుతోన్న ఈ జోడీని కరణ్ శర్మ విడదీశాడు. మిల్లర్‌ను ఔట్ చేసి.. 69 పరుగుల భాస్వామ్యానికి తెరదించాడు.
అనంతరం విజయ్ కుమార్ వేసిన 13వ ఓవర్ నాలుగో బంతికి షారుఖ్ ఖాన్ రనౌట్ అయ్యాడు. బంతికి ఎదుర్కొన్న తెవాటియా.. పాయింట్ వైపుగా డిఫెన్స్ ఆడాడు. ఆ సమయంలో సింగిల్ కోసం యత్నించిన షారుఖ్.. కోహ్లీ సూపర్ త్రోతో వెనుదిరిగాడు. దీంతో 87 పరుగుల వద్ద టైటాన్స్ ఐదో వికెట్ కోల్పోయింది.
VIRAT KOHLI MAGIC IN THE FIELD...!!! 🔥 pic.twitter.com/jYjTd6nBXw
— Johns. (@CricCrazyJohns) May 4, 2024