అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న పోరులో సన్ రైజర్స్ బ్యాటర్లు తడబడుతున్నారు. మునుపటి మ్యాచ్‌లో పరుగుల వరద పారించిన హైదరాబాద్ బ్యాటర్లు.. గుజరాత్ బౌలర్ల వంతు వచ్చేసరికి ఆ జోరు కనపరచలేకపోతున్నారు. 15 ఓవర్లలోపే సన్ రైజర్స్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
మయాంక్ అగర్వాల్(16), ట్రావిస్ హెడ్(19), అభిషేక్ శర్మ(29) స్వల్ప స్కోరుకే వెనుదిరగ్గా.. ఆదుకుంటారనుకున్న హెన్రిచ్ క్లాసెన్(24), ఐడెన్ మార్క్రామ్(17) వారి వెంటే పెవిలియన్ చేరారు. దీంతో సన్ రైజర్స్ 14.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ప్రస్తుతం అబ్దుల్ సమాద్(0 నాటౌట్), షాబాజ్ అహ్మద్(6 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వీరిద్దరిపైనే హైదరాబాద్ విజయావకాశాలు ఆధాపడి ఉన్నాయి. కనీసం 170 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశిస్తే కానీ, మ్యాచ్ లో పైచేయి సాధించలేరు.
It needed a Rashid Khan's special to end six-hitting machine, Heinrich Klaasen innings in Ahmedabad.
— CricTracker (@Cricketracker) March 31, 2024
📸: Jio Cinema pic.twitter.com/zaojgCcTG7