![GTA 6 : యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ట్రైలర్..ఒక్క రోజులో 90 మిలియన్ల వ్యూస్](https://static.v6velugu.com/uploads/2023/12/gta-6-trailer-hits-youtube-with-over-90-million-views-within-a-single-day-of-its-release_frqKY1nb4v.jpg)
జీటీఏ (గ్రాండ్ థెఫ్ట్ ఆటో సిరీస్) లవర్స్కి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జీటీఏ 6 (GTA)ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ను రాక్ స్టార్ గేమ్స్ అకౌంట్ నుండి రిలీజ్ చేశారు. 1:31 నిడివి ఉన్న ట్రైలర్ జీటీఏ లవర్స్ ను అట్ట్రాక్ట్ చేసేలా అదిరిపోయింది. ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన జస్ట్ 10 నిమిషాల్లోనే 1మిలియన్ లైక్స్ వచ్చాయి. అంత క్రెజీ ఉన్న ఈ ట్రైలర్ ఆడియన్స్కు ఫెస్టివల్ ట్రీట్ ఇస్తోంది.
ప్రస్తుతం GTA 6 ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది..రిలీజైన ఒక్క రోజులోనే 90 మిలియన్ల వ్యూస్ సాధించి సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన 1ఇయర్ కి గేమ్ ఆడుకోవడానికి 2025 నుంచి అందుబాటులోకి రానుంది. పాత వర్షన్స్ అయినా PS4 గానీ, Xbox 1కి గానీ GTA 6 గేమ్ సపోర్ట్ చేయదని మేకర్స్ తెలిపారు. ఇప్పటికి వచ్చిన జీటీఏ సిరీస్ లో జెంట్స్ లీడ్ రోల్ చేయగా..GTA 6 లో లేడీ క్యారెక్టర్ లూసియా లీడ్ రోల్లో నటిస్తోన్నట్లు ట్రైలర్లో చూపించారు.
ఎందుకింత వ్యూస్ వస్తోన్నాయి?
అసలు ఇంత క్రేజీ ఉన్న ఈ గేమింగ్ సీరిస్ పై మక్కువ పెగడానికి కారణం ఏమై ఉంటుందని ఆడియన్స్ తెగ ఆలోచిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే యూత్కి గేమింగ్ టెక్నాలజీ బాగా దగ్గరైందని చెప్పడంలో ట్రైలర్ నిరూపించింది. ప్రతి యువత ఫోన్ కొనేముందు అడిగే మొదట ప్రశ్న..ఇందులో గేమ్స్ ఆడుకోవడానికి సాఫ్ట్ వెర్ సపోర్ట్ చేస్తోందా? అన్ని అప్డేట్స్ గేమ్స్ ఆడుకోవొచ్చా? అనే ప్రశ్నలు వేయడంతోనే మొబైల్ కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా జీటీఏ 6 ట్రైలర్ రేలిం అయినా ఒక్క రోజుల్లోనే 90 మిలియన్ల వ్యూస్ సాధించడానికి కారణమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
GTA సిరీస్ ఎప్పుడు మొదలు:
ఈ గ్రాండ్ థెఫ్ట్ ఆటో సిరీస్ 1997లో ప్రారంభమైంది. ఇప్పటివరకు జీటీఏ 400 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ సిరీస్‌లోని చివరి గేమ్ జీటీఏ 5 2013లో రిలీజ్ అయ్యి..గ్రాండ్ సక్సెస్ అయింది.ఇక ఇప్పుడు..12ఏళ్ల తర్వాత..జీటీఏ 6 వస్తుండటం, గ్రాండ్ థెఫ్ట్ ఆటో లవర్స్కి అదిరిపోయే థ్రిల్లింగ్ న్యూస్‌గా మారింది.