గుడాల కృష్ణమూర్తి సేవలు చిరస్మరణీయం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గుడాల కృష్ణమూర్తి సేవలు చిరస్మరణీయం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మహదేవపూర్, వెలుగు: కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ గూడాల కృష్ణమూర్తి ఈ ప్రాంత ప్రజలకు సేవలు చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ లో గుడాల కృష్ణమూర్తి ఇటీవల మృతి చెందడంతో శనివారం ఎంపీ వంశీకృష్ణ ఆయన ఇంటికి వచ్చి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ మహదేవపూర్ మండలాధ్యక్షుడు కోట రాజబాబు, మాజీ జడ్పీటీసీ అరుణ, ఎంపీపీ రాణిబాయి, గుడాల శ్రీనివాస్, వామన్ రావు, వరప్రసాద్, అక్బర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.  

మహదేవపూర్‎కి ఎంపీగా మొదటిసారి వచ్చిన గడ్డం వంశీకృష్ణకు పలు సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్ కు కాంపౌండ్ వాల్ కావాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఇందుకు ఎంపీ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో మాల మహానాడు మండల ప్రెసిడెంట్ రేవెల్లి రాజశేఖర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రెసిడెంట్ మెరుగు లక్ష్మణ్, స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ లింగాల రామయ్య తదితరులు పాల్గొన్నారు.