
పటాన్చెరు, వెలుగు: పటాన్చెరు మండలంలోని లక్టారంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జీఎంఆర్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, వెంకటరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ శంకర్ గౌడ్, ధనరాజ్ గౌడ్, మాణిక్ ప్రభు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.