కలెక్టరేట్‌కు  ఐలమ్మ పేరు పెట్టాలి: హుజూర్ నగర్ ఎంపీపీ

హుజూర్ నగర్, వెలుగు : సూర్యాపేట కలెక్టరేట్‌కు చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బూరుగడ్డ గ్రామంలో  ఆమె ఫొటోకు పూలమాలవేసి నివాళులు అర్పించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో రజకులకు కనీసం ఐదు అసెంబ్లీ స్థానాల్లో అవకాశం కల్పించాలని కోరారు.  అలాగే వేపలసింగారంలో సర్పంచ్ అన్నెం శిరీషా కొండారెడ్డి , ఎంపీటీసీ ముడెం గోపిరెడ్డి  ఐలమ్మ ఫొటోకు పూలమాలవేసి నివాళి అర్పించారు.