ఎంపీఎల్​ విన్నర్ ​గుడిపేట టైటాన్స్

  • రూ.లక్ష ప్రైజ్​ మనీ అందజేసిన అంజనీపుత్ర చైర్మన్​ గుర్రాల శ్రీధర్
  • రన్నరప్​కు​ రూ.50 వేలు​

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలోని శివాజీ గ్రౌండ్​లో పదిరోజుల నుంచి జరగుతున్న మంచిర్యాల ప్రీమియర్​ లీగ్​ (ఎంపీఎల్) సీజన్–2 క్రికెట్ పోటీలు ముగిశాయి. గురువారం ఫైనల్​లో గుడిపేట టైటాన్స్​జట్టు విన్నర్​గా, ఎస్ఆర్​హెచ్​(ఎన్టీఆర్​నగర్​) జట్టు రన్నర్​గా నిలిచాయి. విజేతకు రూ.లక్ష ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీలను అంజనీపుత్ర ఎస్టేట్స్​ చైర్మన్​ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి అందజేశారు. రన్నర్స్​కు వసుధ హాస్పిటల్ సన్నీ పటేల్, కెల్విన్ హాస్పిటల్ కొమ్ము శ్రీనివాస్, ఉదారి చంద్రమోహన్​గౌడ్ రూ.50 వేల నగదు బహుమతి అందజేశారు. ఎంపీఎల్ నిర్వాహకులు గురూస్ క్రికెట్ అకాడమీ దుర్గాప్రసాద్​ను పలువురు అభినందించారు.