
వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.. జగన్ చుట్టూ ఉన్న కోటరీ వాళ్ళ నష్టపోయానంటూ విజయసాయి చేసిన కామెంట్స్ వైసీపీలో తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో విజయసాయి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి. వైఎస్ జగన్ కోటరీ అంటే ప్రజలే అని.. ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో చెప్పాలని అన్నారు అమర్నాథ్.
చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా అని ప్రశ్నించిన అమర్నాథ్ మొన్నటి వరకు కోటరిలో ఉన్న మనమే కోటరీ గురించి మాట్లాడితే ఏమి బాగుంటుందంటూ విజయసాయికి కౌంటర్ ఇచ్చారు. వేరే వారు మీద ప్రేమ పెరిగితే మిగతా వారి మీద ప్రేమ తగ్గుతుందని.. పార్టీ మారిన వ్యక్తి నుంచి అంతకంటే ఏమి ఆశిస్తామని అన్నారు.
ALSO READ | గుంటూరు కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న పోసాని.. 14 రోజుల రిమాండ్ విధించిన జడ్జి
విజయసాయి వైసీపీలో లో కీలకమైన పదవులు అనుభవించారని.. రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు కానీ.. నిన్నటి మాటలు చూస్తే తేడాగా కనిపిస్తుందని అన్నారు అమర్నాథ్. మళ్ళీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే పార్టీ నుంచి వెళ్లే పోయేవారా.. ఇదే విధంగా మాట్లాడే వారా.. అని ప్రశ్నించారు.
ఢిల్లీలో మాట్లాడిన మాటలకు.. విజయవాడలో మాటలకు చాలా తేడా ఉందని, నిన్నటి మాటలు ద్వారా ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్తారనే విధంగా ఉన్నాయని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను ప్రజలు హర్షిస్తారా అని ప్రశ్నించారు అమర్నాథ్. రాష్ట్రంలో మూడు వర్గాలున్నాయని.. ఒకటి కూటమి వర్గం, రెండు వైసీపీ వర్గం,ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లోకి మారిపోయే మూడో వర్గమని అన్నారు అమర్నాథ్.