
గుడివాడ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్(సీఐ) జయకుమార్ రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీఐ లంచం డిమాండ్ చేస్తున్నాడని ఇమేజ్ డిజిటల్స్ మేనేజర్ కిరణ్ ఏసీబీ అధికారులుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు పక్క ప్లాన్ తో జయకుమార్ ను పట్టుకున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో 2023 జూన్ 26 సోమవారం ఉదయం గుడివాడ రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంపై దాడులు నిర్వహించాయి. సీఐ జయకుమార్ ఇంటిపైనా దాడులు చేసినట్లుగా తెలుస్తోంది.
ముఖ్యమంత్రి గుడివాడ పర్యటన సందర్భంగా 'గో బ్యాక్ -జగన్', 'దళిత ద్రోహి జగన్' స్టిక్కర్లను ముద్రించిన 'ఇమేజ్ డిజిటల్స్'పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇమేజ్ డిజిటల్స్ యాజమాన్యంపై సీఐ వేధింపులు కొనసాగిస్తున్నారు. వేధింపులు కొనసాగించకుండా ఉండేందుకు సీఐ లంచం అడిగాడని ఇమేజ్ డిజిటల్స్ యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించింది. దీంతో పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు సీఐని పట్టుకున్నారు.