గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు..

జగిత్యాల జిల్లా మల్యాల మండలం మనాల శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ. 30వేల విలువగల.. 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. గుడుంబా తయారీకి ఉపయోగించే వస్తువులను, పాత్రలను కూడా ధ్వంసం చేశారు. ఈ కేసులో నిర్వహకుడు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు.