ప్రజలకు అండగా ఉంటా : గూడూరు నారాయణరెడ్డి

యాదాద్రి, వెలుగు :  కేసీఆర్​ పాలనలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బీజేపీ అండగా నిలబడుతోందని ఆ పార్టీ  భువనగిరి అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి తెలిపారు. భువనగిరి మండలంలోని బీఎన్​ తిమ్మాపూర్​ సహా పలు గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్​ను వివరించారు. అనంతరం తనను గెలిపించే ప్రజల కోసం పాటుపడతానని తెలిపారు.

స్టూడెంట్స్​ కోసం తన సొంత డబ్బుతో జిల్లా కేంద్రమైన భువనగిరిలో డిగ్రీ కాలేజీ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. భువనగిరిలో ఐటీ హబ్​ ఏర్పాటు చేయిస్తానని ఆయన తెలిపారు. ఈ హబ్​ ద్వారా 30 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించేలా చూస్తానని చెప్పారు. పోటీ పరీక్షల కోసం కోచింగ్​ సెంటర్లు చేసి ఉన్నతస్థాయి ఉద్యోగాలు వచ్చేలా చూస్తానని తెలపారు.  గెలిపించిన తర్వాత పైళ్ల శేఖర్​రెడ్డి లాగా  సొంత బిజినెస్​లు చూసుకోకుండా ప్రజల కోసమే పని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.