యాదాద్రి(భువనగిరి), వెలుగు: జీఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా యువతకు నిరంతరం ఉచితంగా కోచింగ్ఇప్పిస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి తెలిపారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ పొందిన 250 మందిలో పోలీస్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన 79 మందిని ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికం కారణంగా యువత నష్టపోవద్దనే ఉద్దేశంతో కోచింగ్ ఇప్పిస్తున్నామని చెప్పారు.
పీఎస్రెడ్డి అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఉద్యోగాలకు ఎంపికైన స్నేహ, దివ్య, ఉమ, మౌనిక, వేద వతి, మల్లీశ్వరి, శరణ్య, రవికుమార్, సలీం, వేణుగోపాల్, మహేశ్, రాకేశ్ ఉన్నారు.