యాదాద్రి, వెలుగు: తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ తప్ప రాష్ట్రంలో ఎవరూ బాగుపడలేదని బీజేపీ భువనగిరి అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి విమర్శించారు. బుధవారం భువనగిరి మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరేంద్రమోదీ సమర్థవంతమైన పాలనతో దేశం ప్రపంచంలోనే అతి పెద్ద శక్తిగా నిలిచిందని చెప్పారు. నమ్మి అవకాశమిస్తే సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని ఆరోపించారు.
తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గంలో ఐటీ హబ్ ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, భువనగిరిని అభివృద్ధి కి కేరాఫ్ అడ్రస్ గా మారుస్తానని హామీ ఇచ్చారు. భువనగిరిలో సొంత నిధులతో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఉచిత వైద్య, విద్యను బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తుచేశారు. ఈ రెండింటిని ఉచితంగా కల్పిస్తే ప్రతి కుటుంబానికి ఏటా రూ. లక్షలు మిగులుతాయని తెలిపారు.
అనంతరం గూడూరు సమక్షంలో గోపగాని తండా, రాముని గుండ్ల తండా, ఎర్ర బెట్టు తండా, బీఎన్ తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన యువకులు బీజేపీలో చేరారు. చేరిన వారిలో లక్ష్మణ్ , వెంకటేశ్ , పవన్, మహేశ్, యువరాజ్, నితిన్, మనోహర్, విజయ్ ప్రశాంత్, చరణ్, రమేష్ పాచ్యా, కృష్ణ, రాము, సుమన్, పాడ్యా, గణేశ్, ఆగచారి, భాను, అన్నేపు నవీన్, వీర స్వామి, హరినాథ్, కుమార్, ఉపేందర్, ధనుష్, వంశీ, నర్సింహులు, మణి దీప్, విశ్వా, క్రాంతి, సతీశ్, ఉన్నారు.