యాదాద్రి, వెలుగు : బీజేపీతోనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమని ఆ పార్టీ భువనగిరి అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం వాకర్స్‌ను కలిసి ఓటు అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాతే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు.
కానీ ఈ పథకాన్ని రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని కూడా గాలికొదిలేశారని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీని సరిగా అమలు చేయని సర్కారు.. లిక్కర్ మాత్రం విచ్చల విడిగా అమ్ముతోందని ఆరోపించారు. లిక్కర్‌పై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.