గెస్ట్ లెక్చరర్ల ఆందోళన... అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలె

ప్రభుత్వ ఇంటర్ కాలేజీల నుంచి గెస్ట్ లెక్చరర్లను తొలగించడాన్ని నిరసిస్తూ...హైదరాబాద్లోని  నాంపల్లి ఇంటర్ బోర్డు ముందు గెస్ట్ లెక్చరర్లు  ఆందోళనకు దిగారు.  రాష్ట్ర వ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 1654 మందిని ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఖండించిన బాధిత లెక్చరర్లు... 10ఏళ్లుగా పని చేస్తున్న తమనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఇంటర్ బోర్డు ముందే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. 

ALSO READ :ఈ ఒక్కసారి గెలిపించండి ..మళ్లీ పోటీ చేయను.. బ్రతిమిలాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే 

కొత్త నోటిఫికేషన్తో గెస్ట్ లెక్చరర్ల కుటుంబాలు రోడ్డున పడతాయని లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. ఇప్పటికే ఆరు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. తమ డిమాండ్పై విద్యా శాఖ మంత్రి , ఇంటర్ బోర్డ్ కమిషనర్ వెంటనే సందించి న్యాయం చేయాలన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.