గెస్ట్​ లెక్చరర్స్​ సమస్యలు పరిష్కరించాలి : జె.జె.సి.పి. బాబూరావు

గెస్ట్​ లెక్చరర్స్​ సమస్యలు పరిష్కరించాలి

తెలంగాణ రాష్ట్రంలోని నేడు అనేక ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లోని అతిథి అధ్యా పకులు (గెస్ట్​ లెక్చరర్స్​) నిత్యం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా రు. ఉమ్మడి ఆంధ్రప్రద్రేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి2012 లో గెస్ట్ లెక్చరర్స్  ఉద్యోగ వ్యవస్థని ప్రారంభించారు. ప్రారంభంలో పీరియడ్ కి కేవలం రూ.150 చొప్పు న నెలకు 72 పీరియడ్స్ మాత్రమే బోధించే వెసులుబాటు గెస్ట్ లెక్చరర్స్​కి లభించేది. ఆ రకంగా వారు నెలకు కేవలం రూ.10,800 ఆర్జిస్తూ ఆ ఉద్యోగాల్లో బతుకులు భారంగా కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కే. చందశ్రేఖర రావు చొరవతో పీరియడ్ కి రూ.300 పెరగడంతో నెలకి రూ.21,600 లకు పెరిగాయి. కాలక్రమేణా ఈ మొత్తం రూ.28,000 లకు పెరిగిననూ ధరలు చుక్కలనంటుకుంటున్న  ప్రస్తుత రోజుల్లో ఆ చాలీచాలని జీతాలు ఏమాత్రం సరిపోక వారు మరింతగా అప్పులపాలు కావాల్సిన పరిస్థితులు నెలకొంటున్నా యి.  2018 నుంచి ప్రభుత్వమే నిర్దిష్ట త్రీ మెన్ కమిటీతో ఇంటర్వ్యూ లు, డెమోలు నిర్వహించి వివాదాలకు తావులేకుండా గెస్ట్​ లెక్చరర్స్​ఎంపిక ప్రక్రియని సమర్థవంతంగా నిర్వహిస్తుంది. గతంలో గెస్ట్​లెక్చరర్స్​ ఆటో రెన్యు వల్ చేసేవారు. కానీ 'నేడు కనీసం ఆటో రెన్యూ వల్ కూడా చేయడం లేదు' అని గెస్ట్​లెక్చరర్స్​ గోస వెలిబుచ్చుకుంటున్నారు. 

6 నెలలుగా జీతాలు లేవు

నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1654 మంది గెస్ట్​లెక్చరర్స్ గత 6 నెలలుగా  జీతాలు లేక అనేక అవస్థలకు గురవుతున్నా రు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్​ జిల్లాలోని 60 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసే 280 గెస్ట్​లెక్చరర్స్ పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. అదేవిధంగా నాగర్​కర్నూ ల్ జిల్లాలోని కొల్లాపూర్, కోడేర్, అచ్చంపేట ప్రాంతాలలోని జూనియర్ కళాశాలల్లో ఒక్క ప్రిన్సి పాల్ మినహా మిగతా లెక్చరర్స్​ అందరూ గెస్ట్​ లెక్చరర్స్ కొనసాగడం గమనార్హం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న 1940 మంది గెస్ట్​ లెక్చరర్స్ కూడా సకాలంలో జీతాలు పొందలేక అనేక అవస్థలు పడుతున్నా రు. అందువలన జూనియర్, డిగ్రీ కళాశాలల గెస్ట్​ లెక్చరర్స్ పెండింగ్ జీతాలు తక్షణమే ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేడు గెస్ట్​ లెక్చరర్స్ ఉద్యోగ భదత్రకు నోచుకోకపోగా, కనీసం పనికితగ్గ వేతనం పొందలేక ప్రతినిత్యం అనేక సంఘర్షణలకు గురి అవుతున్నా రు.

నిబద్ధతతో పని చేస్తున్నారు 

గెస్ట్​ లెక్చరర్స్  నిజాయితీతో,నిబద్ధతతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ విద్యా వ్యా ప్తికి ఎంతగానో దోహదపడుతున్నారు. సెలవు రోజుల్లోనూ సైతం వారు జీతాలకు నోచుకోవడం లేదు. అందువలన వారికి పీరియడ్ల వారీగా కాకుండా నెలవారీ జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే వారు బదిలీ అయిన చోట తక్షణమే రీ-ప్లేస్మెంట్ కల్పించాలి.  గెస్ట్​ లెక్చరర్స్ గతంలో ఆర్థిక భారాలతో ఆత్మహత్యలు చేసుకున్న హృదయ విదారక ఘటనలు ఉండడం గమనార్హం. గెస్ట్​ లెక్చరర్స్ కరోనా సమయంలో ఆన్​లైన్ క్లాసులు కూడా సమర్థంగా తీసుకుని రెగ్యులర్ ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోకుండా బాధ్యతలు నిర్వహించారు. కార్పొ రేట్ కళాశాలలకు ధీటుగా ఊరు-వాడలు తిరిగి విద్యా ర్ధులను ప్రభుత్వ కళాశాలలకు తీసుకొచ్చి  ర్యాంకులు సాధించడంలో కృషి చేశారు. ప్రభుత్వ విద్యని పరిపుష్టం చేసిన గెస్ట్​లెక్చరర్స్ అన్ని సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి. 

-జె.జె.సి.పి. బాబూరావు,రీసెర్చ్ స్కాలర్