పిల్లికి బిచ్చం పెట్టరు కానీ, ఇంట్లో పెళ్లికి లక్షలు ఖర్చు పెడతారని అంటారు. ఇప్పుడు మీరు ఈ వార్త చదివితే అదే నిజం అంటారు. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో జరిగిన పెళ్లి ఊరేగింపు వీడియోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. పెళ్లికి వచ్చిన అతిథులు నోట్ల కట్టలు విసురుతున్నారు. రూ.100, రూ.200, రూ.500 నోట్లను గాల్లోకి రూ.20 లక్షల డబ్బు విసిరారు. ఈ వీడియో ప్రస్తుతం నెటింట్లో వైరల్ గా మారింది.
ALSO READ : పిల్లాడు నల్లగా పుట్టాడని భార్యపై అనుమానం.. DNA టెస్ట్ చేస్తే చివరికి..
పెళ్లి కొడుకు తరుపు నుంచి వచ్చిన చుట్టాలు ఇళ్లపై, JCB పై నిలబడి నోట్ల కట్టలను గాలిలోకి చల్లుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఇటీవల అఫ్జల్, అర్మాన్ ల వివాహం జరిగింది. ఈ పెళ్లిలోనే బంధువులు రూ.20 లక్షల డబ్బు పంచారంట. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఈ వీడియోకి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వచ్చాయి. ఓ వ్యక్తి ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకు కాల్ చేయండని రాస్తే.. మరో వ్యక్తి ఆ డబ్బు అవసరమున్న వారికి పంచితే బాగుండని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇలా ఈ వీడియో వైరల్ గా మారింది.