గూడూరు, వెలుగు : ఎస్సీ ఉపకులాలపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ లేదని ఎంఎస్పీ జాతీయ నాయకుడు గుగ్గిళ్ల పీరయ్య విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో గురువారం మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏళ్లుగా చేస్తున్న ఉద్యమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిగో.. అదిగో అంటూ పదేళ్లు కాలం వెల్లదీశాయే తప్ప ఎస్సీ వర్గీకరణ గురించి పట్టించుకన్న దాఖలాలు లేవన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణతోనే ఉపకులాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చినందున వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తామని ప్రకటించారు. సమావేశంలో మోతీలాల్, ధర్మారెడ్డి, వెంకన్న, రవి, పాశం సాంబయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.