
ప్రపంచ రికార్డు సాధించడానికి కొందరు ఎన్నో ఏండ్లు శ్రమిస్తారు. మరికొందరు తమకున్న స్పెషల్ ఎబిలిటీస్‌ని ప్రదర్శించి రికార్డ్ కొల్లగొడతారు. అయితే కొన్నిసార్లు ఎప్పుడూ చూడని, ఎక్కడా వినని వింతైన సంఘటనలు రికార్డుకెక్కుతుంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఏదైనా ఒక పనిని ఊహించనంతమంది ఒకేసారి చేస్తే రికార్డు సొంతమవుతుంది. అలాంటిదే ఇది కూడా.
మిస్సోరిలోని సిటీ మ్యూజియం సెయింట్ లూయిస్‌లో గిన్నిస్ రికార్డు కోసం ఒక స్టంట్ జరిగింది. ఆ స్టంట్ ఏంటంటే.. సాయంత్రం 5.30 నిమిషాలకు 309 మంది టోపీలు ధరించారు. అవి మామూలు హ్యాట్స్ కాదు.. అరటి పండ్ల ఆకారంలో ఉండే టోపీలు. వాటిని బనానా హ్యాట్స్ అంటారు. ఎ పీలింగ్ (A– peel– ing) గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ కోసం మ్యూజియం వారు తమకు తెలిసిన ఫ్రెండ్స్ అందర్నీ ఆహ్వానించారు. టీం వర్క్ వల్లే ఇదంతా సాధ్యమైందని అందరికీ ధన్యవాదాలు తెలిపింది మ్యూజియం యాజమాన్యం. ఈ స్టంట్‌లో ఉపయోగించిన బనానా హ్యాట్స్ని రాస్తా ఇంపోస్టా కాస్ట్యూమ్స్ వాళ్లు సప్లై చేశారు.
►ALSO READ | కిచెన్ తెలంగాణ : నవమినాడు.. నవ్యంగా.. వివిధ రుచులతో వెరైటీ రెసిపీలు