
రైలు ప్రయాణం..అందరికీ అలవాటుగానే ఉంటుంది.. రైలు జర్నీ సమయంలో మనం వాడేసిన వాటర్ బాటిల్స్, ఫుడ్ ప్యాకెట్లను కిటికీ నుంచి బయటకు విసిరేయటం అనేది చాలా చాలా కామన్గా చూస్తుంటాం.. అందరికీ అనుభవమే..గతంలో ఎప్పుడూ జరగని.. కలలో కూడా ఊహించని ఓ ఘటన ఇప్పుడు జరిగింది. ఇలా కూడా ప్రమాదం జరుగుతుందా..ఓ చిన్న పిల్లోడు ఇలా కూడా చనిపోతాడా అనే విధంగా ఉన్న ఈ షాకింగ్ ఇన్సిడెంట్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కలలో కూడా ఊహించి ఉండరు ఇలా జరుగుతుందని.. రైలులోంచి విసిరిన బాటిల్ ఆ బాలుడి పాలిట యముడిలా మారింది.గుజరాత్ లోని రాజ్ కోట్ లో బాదల్ సంతోష్ భాయ్ ఠాకూర్ అనే 14 యేళ్ల బాలులు రైలులోంచి విసిరిన వాటర్ బాటిల్ తగిలి చనిపోయాడు. బాటిల్ బాలుడి ఛాతిపై తగలడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. చూస్తుండగానే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
సోమవారం (మార్చి 31) రాజ్ కోట్ లోని షాపర్ వెరవల్ ప్రాంతంలో ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకుంటున్న బాదల్.. సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లాడు. అయితే వెరావల్ బాంద్రా టెర్మినస్ రైలు మొదటి కోచ్ లో ఉన్న ప్రయాణికుడు బాటిల్ బయటికి విసరడంతో బాదల్ ఛాతికి బలంగా తాకింది. దీంతో బాదల్ స్పృహతప్పి పడిపోయాడు. చికిత్స ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజ్ కోట్ లోని సివిల్ ఆస్పత్రి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.
►ALSO READ | బెంగళూరులోని తెలుగు ఫ్యామిలీలకు షాక్స్.. ఇక బతకటం కష్టమే..!
ఇలాంటి ఘటనలు తరుచుగా జరుగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపిన ప్రకారం తెలుస్తోంది. గతంలో ముంబై లోకల్ ట్రైన్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. మహిళా కోచ్ లోకి ఓ యువకుడు విసిరిన మద్యం బాటిల్ విసిరడంతో కంపార్టుమెంట్ లో మహిళలకు గాయాలయ్యాయి. మార్చి 11న రాత్రి 8.30గంటలకు టిట్వాలా లోకల్ ట్రైన్ లో ఈ ఘటన జరిగింది.