గుజరాత్: బ్రోకర్ ఇంట్లో 90 కేజీల బంగారం సీజ్

గుజరాత్: బ్రోకర్ ఇంట్లో 90 కేజీల బంగారం సీజ్

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. మంగళవారం( మార్చి18) అక్రమ బంగారం రవాణా కట్టడిలో భాగంగా అహ్మదాబాద్ లోని పాల్డి ప్రాంతంలో  ఓ ఇంటిపై గుజరాత్ పోలీసులు జరిపిన దాడుల్లో 90కిలోల బంగారం సీజ్ చేశారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఓ బ్రోకర్ ఇంట్లో గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) ,డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సంయుక్తంగా  సోదాలు నిర్వహించారు.ఈ దాడుల్లో అక్రమంగా నిల్వఉంచిన రూ. 83కోట్ల విలువైన బంగారం బిస్కెట్లు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 60 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన బంగారంపై దర్యాప్తులో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో గుజరాత్ లో భారీగా బంగారం అక్రమ రవాణా కేసులు నమోదు అయ్యాయి. 

2023 జూలైలో సూరత్ ఎయిర్ పోర్టులో దాదాపు రూ. 25 కోట్ల విలువైన 48.2 కిలోల బంగారు పేస్ట్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) స్వాధీనం చేసుకుంది.ఈ ఆపరేషన్ లో షార్జా నుండి వచ్చిన ముగ్గురు ప్రయాణికులు,ఒక విమానాశ్రయ అధికారిని అరెస్టు చేశారు. 

ALSO READ | వామ్మో: కరోనా మళ్ళీ దాపురించింది..కోల్కతాలో మహిళకు హెచ్కేయూ1 వైరస్.. లక్షణాలు ఇవే..

స్క్రీనింగ్ నుండి తప్పించుకోవడానికి ఇమ్మిగ్రేషన్ చెక్‌పాయింట్ ముందు ఉన్న టాయిలెట్‌లో బంగారాన్ని మార్పిడి చేసుకోవాలని ప్రణాళిక వేసుకుని, వారి బ్యాగేజీలో ఐదు బ్లాక్ బెల్టులలో 20 ప్యాకెట్లలో బంగారాన్ని దాచిపెట్టారు.అదే నెలలో దుబాయ్ నుంచి బంగారం అక్రమ రవాణాచేస్తున్న ఓ నగల వ్యాపారిని, మరో జంటను అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ అరెస్ట్ చేసింది. 

నిందితులు బంగారం పేస్ట్ లు, లోదుస్తులు, పిల్లల డైపర్లు, శానిటరీ ప్యాడ్ లలో దాచిపెట్టి అక్రమంగా రవాణా చేస్తున్నారు. 2021 నుంచి గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) ,డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సంయుక్తంగాఆపరేషన్ నిర్వహిస్తున్నారు.