గుజరాత్ కాంగ్రెస్ లీడర్కు.. మహారాష్ట్రలో తీవ్ర గుండెపోటు

గుజరాత్ కాంగ్రెస్ లీడర్కు.. మహారాష్ట్రలో తీవ్ర గుండెపోటు

నాసిక్: మహారాష్ట్రలో జరుగుతున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. నాసిక్లో ఎన్నికల ప్రచారం చేస్తున్న గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత పరేష్ ధనానికి గుండెపోటు రావడంతో ప్రచారంలో కుప్పకూలారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

2024 లోక్సభ ఎన్నికల్లో రాజ్కోట్ నుంచి పరేష్ ధనాని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ధనానిపై బీజేపీ అభ్యర్థి పర్షోత్తం రూపాలా విజయం సాధించారు. ఈ ఇద్దరూ కొన్నేళ్ల క్రితం.. 2002లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తలపడ్డారు.

Also Read :- కోర్టు హాల్​లోనే లాయర్లపై లాఠీచార్జ్..

గుజరాత్లోని అమ్రేలి శాసనసభ స్థానం నుంచి ఈ ఇద్దరూ పోటీపడగా, రూపాలాపై ధనాని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత లోక్సభ ఎన్నికల్లో నెగ్గి ధనానిపై రూపాలా బదులు తీర్చుకున్నారు. త్వరలో జరగబోతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి మహారాష్ట్ర వచ్చిన ధనానికి ఇలా జరగడంతో ఆయన కుటుంబం ఆందోళనకు లోనైంది.