వరద బీభత్సం : ఇవి నదులు కాదు.. గుజరాత్ రాష్ట్రంలోని వీధులు

వరద బీభత్సం : ఇవి నదులు కాదు.. గుజరాత్ రాష్ట్రంలోని వీధులు

గుజరాత్ రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది. వరదలతో బీభత్సంగా మారింది. అవి నదులా.. వీధులా అన్నంతగా.. తేడా లేకుండా మారిపోయాయి నగరాలు. అహ్మదాబాద్, వడోదరా, ద్వారకా, కచ్ సౌరాష్ట్రలోని అనేక ప్రాంతాలు కుండపోత వర్షాలతో నీట మునిగాయి. రెండు రోజులుగా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్, వడోదర ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయంటూ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 

గుజరాత్ వరదల నుంచి జనాన్ని రక్షించటానికి భారత సైన్యం సైతం రంగంలోకి దిగింది. సైన్యంతోపాటు NDRF, గుజరాత్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (SDRF) టీమ్స్ నిరంతరం శ్రమిస్తున్నాయి. ఇప్పటికే 12 వేల మందిని నీట మునిగిన ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించగా.. 5 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 

Also Read :- ఆన్ లైన్ పాస్ పోర్ట్ పోర్టల్ మూసివేత

విశ్వామిత్ర నది వరద ఉధృతికి వడోదర సిటీ నీట మునిగింది. వడదోరలోని లోతట్టు ప్రాంతాల్లో ఆరు అడుగుల నీళ్లు ఉన్నాయి. బైక్స్, కార్లు నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. వేలాది వాహనాలు కొట్టుకుపోయాయి. రెస్క్యూ బృందాలు మూడు రోజులుగా 24 గంటలూ పని చేస్తున్నా.. పరిస్థితి అదుపులోకి రావటం లేదు.

ద్వారక నగరంలో 48 గంటలు కుండపోత వర్షం పడటంతో.. ద్వారకా నగరం మొత్తం వరదలో చిక్కుకుపోయింది. ఇళ్లు నీట మునిగాయి. 

 సౌరాష్ట్ర ఏరియాలో మళ్లీ కుండపోత వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలతో గుజరాత్ జనం భయాందోళనలో ఉన్నారు. ఆగస్ట్ 30వ తేదీ నాటికి అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడే సూచనలు ఉండటంతో.. రాబోయే వారం రోజులు గుజరాత్ రాష్ట్రం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోనుంది.