![గార్బాకు యునెస్కో గుర్తింపు](https://static.v6velugu.com/uploads/2023/12/gujarat-garba-is-now-in-list-of-unesco-intangible-cultural-heritage-of-humanity_HBQmOKujh7.jpg)
అహ్మదాబాద్ : గుజరాత్లో ప్రజాదరణ పొందిన గార్బా డ్యాన్స్‌కు యునెస్కో గుర్తింపు లభించింది. ఇంటాన్ జిబుల్ కల్చరల్ హెరిటేజ్ (ఐసీహెచ్) లిస్ట్ లో గార్బా స్థానం సంపాదించుకుంది. ఈ విషయాన్ని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ బుధవారం తెలిపారు. మంగళవారం బోట్స్ వానాలోని కసానేలో ఐసీహెచ్ ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ–18 వ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలోనే ఐసీహెచ్ కన్వెషన్–2003 నిబంధనల ప్రకారం గార్బాను లిస్ట్ లో చేర్చాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతినిధి ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘‘ఐసీహెచ్ లిస్ట్ లో ఇండియా నుంచి స్థానం సంపాదించుకున్న 15వ అంశంగా గుజరాతీ గార్బా నిలిచింది. సామాజిక, లింగ సమానత్వాన్ని పెంపొదించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కమ్యూనిటీలను ఏకతాటిపైకి తేవడానికి ఉపయోగపడుతుంది. అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో భాగమైన ఈ గార్బా మూలాలు ఆచారాల్లో లోతుగా పాతుకుపోయాయి” అని చెప్పారు.