
లక్నో: రెండు వరుస విజయాలతో దూకుడు మీదున్న గుజరాత్ జెయింట్స్.. డబ్ల్యూపీఎల్‌లో ప్లే ఆఫ్స్ బెర్త్‌పై కన్నేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బలమైన ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. స్టార్టింగ్‌లో టేబుల్‌లో చివరి ప్లేస్‌లో ఉన్న గుజరాత్... 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై, 81 రన్స్ తేడాతో యూపీపై భారీ విజయాలు సాధించి మూడో ప్లేస్‌లో ఉంది. ప్రస్తుతం ఆరు పాయింట్లతో ఉన్న గుజరాత్.. ఢిల్లీపై గెలిస్తే 8 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువవుతుంది.
ఇది జరగాలంటే డీసీతో జరిగే మ్యాచ్‌లో ఆష్లే గార్డ్‌నర్, బెత్ మూనీ, లిచ్‌ఫీల్డ్, హేమలత, హర్లీన్ డియోల్ బ్యాటింగ్‌లో సత్తా చాటాలి. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు కుదురుకున్నా భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌లోనూ గుజరాత్‌కు తిరుగులేదు. దియోంద్ర డాటిన్, కశ్వీ గౌతమ్, మేఘనా సింగ్, తనుజా కన్వర్, ప్రియా మిశ్రా చెలరేగితే డీసీకి కష్టాలు తప్పవు.
ఇక ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన ఢిల్లీ ఈ మ్యాచ్‌లో గెలిచి 12 పాయింట్లతో డైరెక్ట్‌గా ఫైనల్ బెర్త్‌ను సాధించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అదే క్రమంలో నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది. మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, జొనాసెన్ సూపర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. కొత్త బాల్‌తో మారిజానె కాప్, శిఖా పాండే చెలరేగితే గుజరాత్‌కు ఇబ్బందులు తప్పవు.