అమ్మో నిమ్మా! భారీగా పెరిగిన ధరలు

దేశంలో ధరల దెబ్బకు సామాన్యులు విలవిల్లాడుతున్నారు.పెట్రోల్,గ్యాస్, నిత్యావసరాలు, వంట నూనెలు, బస్సు చార్జీలు.. ఒక్కటేంటి అడుగు తీసి అడుగేస్తే రేట్ల మోత. ఈ క్రమంలోనే తానూ తక్కువకాదంటూ కన్నీళ్లు పెట్టిస్తోంది నిమ్మకాయ.రోజు రోజుకు టెంపరేచర్ పెరిగినట్టే నిమ్మకాయల ధరలు  కూడా పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రేట్లు పలుకుతున్నాయి. గుజరాత్ లో నిమ్మకాయలకు రెక్కలు వచ్చాయి. ఆకాశమే హద్దుగా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎంతలా అంటే యాపిల్ కు పోటీ పడుతూ రేట్లు  పెరిగిపోతున్నాయి. ఓవైపు వేసవికాలం.. మరోవైపు సరఫరా కొరత కారణంగా  గుజరాత్ లో నిమ్మకాయల ధర విపరీతంగా పెరిగింది..తుపాను కారణంగా గతేడాది ఏపీ,మహారాష్ట్ర, గుజరాత్ లలో నిమ్మకాయ మొక్కలు దెబ్బతిన్నాయన్నారు వ్యాపారులు. దీంతో తగినంత ఉత్పత్తి  లేక ధర విపరీతంగా పెరిగిందంటున్నారు వ్యాపారులు.


అటు ఉత్తరాఖండ్ లో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మాదిరిగానే నిమ్మకాయల ధర కూడా రోజు రోజుకు పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్ లో కేజీ నిమ్మకాయలు రూ.200 నుంచి 250 రూపాయల వరకు ధర పలుకుతుందని తెలిపారు.అటు కూరగాయల ధరలు కూడా సామాన్యులు కొనలేని విధంగా సమ్మర్ లో ధరలు మండిపోతున్నాయని వాపోతున్నారు. 

మరిన్ని వార్తల కోసం

సర్ఫ్, నూనె, కెమికల్స్​తో పాల తయారీ

పెళ్లికి పెట్రోల్, డీజిల్ బాటిళ్లు గిఫ్ట్ గా ఇచ్చిన ఫ్రెండ్స్