- గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘటన
అహ్మదాబాద్: ఆటపట్టిద్దామని చేసిన ప్రాంక్ బెడిసికొట్టింది. తనను కలిసేందుకు వచ్చిన బంధువుకు మలద్వారంలో కంప్రెషర్ పైప్ పెట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల ఈ ఘటన జరిగింది. ప్రకాశ్ వంకర్ అనే వ్యక్తి తన బంధువులతో గడిపేందుకు అహ్మదాబాద్ నుంచి రిపబ్లిక్ డే రోజున మెహసానాకు వెళ్లాడు. అక్కడ తన కజిన్లు అల్పేశ్, ఘేవాభాయ్లను కలుద్దామని వారు పనిచేసే మెటల్ కంపెనీకి వెళ్లాడు.
ఆ కంపెనీలోని కార్మికులంతా ఎయిర్ కంప్రెషర్‌తో పెయింట్‌ను ఆరబెట్టే పనిలో బిజీగా ఉన్నారు. అదే టైంలో వచ్చిన ప్రకాశ్‌ను అల్పేశ్ ఆటపట్టించాలనుకున్నాడు. కార్మికుల దగ్గరున్న కంప్రెషర్ పైపును తీసుకుని ప్రకాశ్ మలద్వారంలోకి చొప్పించాడు. అదికాస్త తేడా కొట్టింది. కంప్రెషర్ పైప్ నుంచి ప్రెషర్‌తో వచ్చిన గాలి.. బాడీలోకి ఎక్కడంతో ప్రకాశ్‌కు వాంతులు మొదలయ్యాయి. ఆపై సోయితప్పి పడిపోయాడు.
దీంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పెద్దాసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్లినప్పటికీ.. తామేంచేయలేమంటూ డాక్టర్లు సివిల్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ప్రకాశ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు అల్పేశ్పై కేసు ఫైల్ చేశారు.