అయిదు నెలల గర్భవతిని చంపి.. ఆమె తండ్రి పొలంలోనే పాతిపెట్టిన పార్టనర్

అయిదు నెలల గర్భవతిని చంపి.. ఆమె తండ్రి పొలంలోనే పాతిపెట్టిన పార్టనర్

గర్భవతి అని కూడా చూడకుండా ఓ మహిళను గొంతు కోసి చంపిన దారుణ ఘటన గుజరాత్‌లో జరిగింది. బార్డోలి పట్టణానికి సమీపంలో రష్మీ కటారియా అనే మహిళ చిరాగ్ పటేల్ అనే వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉంటుంది. రష్మీకి అంతకుముందే పెళ్లె ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆమె భర్తతో విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉండేది. అలాగే చిరాగ్ పటేల్‌కు కూడా గతంలోనే పెళ్లైంది. అతను కూడా తన భార్యతో విడిపోయి ఒంటిరిగా ఉంటున్నాడు. దాంతో వీరిద్దరూ తమ పరిచయంతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేశారు. కాగా.. నవంబర్ 14న రష్మీ తన మూడేళ్ల కొడుకును తల్లిదండ్రుల వద్ద విడిచి వెళ్లింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. దాంతో ఆమెను వెతికిన కుటుంబసభ్యులు.. రష్మీ జాడ తెలియకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఐదేళ్ల నుంచి రష్మీ.. చిరాగ్ పటేల్ అనే వ్యక్తితో లివ్-ఇన్ రిలేషన్‌లో ఉందని పోలీసులకు ఆమె కుటుంబం తెలిపింది. దాంతో పోలీసులు చిరాగ్ పటేల్‌ను విచారించగా ఆమెను చంపినట్లు ఒప్పుకున్నాడు.

తాను, రష్మీ అనేకసార్లు గొడవపడ్డామని.. అందుకే ఆమెను చంపానని చిరాగ్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఆమెను గొంతుకోసి చంపి.. మృతదేహాన్ని ఆమె తండ్రి పొలంలో పాతిపెట్టినట్లు పోలీసులకు తెలిపాడు. చిరాగ్ తెలిపిన సమాచారం ప్రకారం పోలీసులు జేసీబీతో రష్మీ తండ్రి పోలంలో నుంచి ఆమె మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి చిరాగ్ మొదటి భార్యను పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే కొన్ని నెలల క్రితం ఆమె రష్మీతో గొడవపడి తీవ్రంగా కొట్టింది. చిరాగ్ పటేల్‌ను పోలీసులు అరెస్టు చేసి.. ఈ హత్యలో అతనికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

తెలంగాణలో కొత్తగా 921 కరోనా కేసులు

వంద మిలియన్ల ఫాలోవర్లను సాధించిన మొట్టమొదటి టిక్‌టాక్ స్టార్