చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికొచ్చాడు. అతని సంతాప సభకు స్వయంగా హాజరయ్యాడు. అతన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధువులంతా షాక్.. చనిపోయినోడు ఎలా తిరిగొచ్చాడని ఓ పక్క ఆనందం.. ఓపక్క ఆశ్చర్యం.. గుజరాత్ లో జరిగిన ఈ విచిత్ర సంఘటనకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ అతను ఎలా తిరిగొచ్చాడు..
గుజరాత్ కు చెందిన బ్రిజేష్.. గత కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.. ఎంత వెదికినా దొరక లేదు..దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అహ్మదాబాద్ లోని నరోడాలో గుర్తు తెలియని, గుర్తు పట్టలేని స్థితిలో ఉన్న డెడ్ బాడీని పోలీసులు గుర్తించి.. బ్రిజేష్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇ చ్చారు..ఆ శవం బ్రిజేష్ దేనని అతని బావమరిది గుర్తించడంతో అసలు కథ మొదలైంది.
బ్రిజేష్..స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాడు.. లాస్ వచ్చింది..దీంతో మానసికంగా కృంగిపోయాడు.. ఆ దిగులుతో ఇంట్లోంచి వెళ్లిపోయాడు..కుటుంబ సభ్యులు ఎంత వెదికినా కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నరోడాలో దొరికిన శవం బ్రిజేష్ దేనని అతని కుటుంబసభ్యులు దహన సంస్కారాలు చేశారు. నవంబర్ 14న సంతాపసభ నిర్వహించారు. అయితే సంతాపసభలో బ్రిజేష్ నడుచుకుంటూ వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. బ్రిజేష్ ను చూసి కుటుంబ సభ్యులు,స్నేహితులు అంతా షాకయ్యారు. చనిపోయినోడు ఎలా తిరిగొచ్చాడని బుర్ర గోక్కున్నారు.
వాస్తవానికి నరోడాలో దొరికిన శవం బ్రిజేష్ ది కాదు. పోలీసులు ఇచ్చి నసమాచారంతో స్పాట్ కు వెళ్లిన కుటుంబ సభ్యులు, బ్రిజేష్ బావమరిది పొరపాటుగా గుర్తిం చారు. ఇంటికి తీసుకొచ్చి సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. సంతాపసభ నిర్వహిస్తున్న సమయంలో అతని రాకతో బ్రిజేష్ చనిపోలేదని గుర్తించారు.
కొన్నికొన్ని సార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి.. నరోడాలాంటి ఘటనలు చాలానే జరిగాయి. బ్రిజేష్ మృతదేహంగా తప్పుగా గుర్తించిన నరోడా పోలీసు లు..ఇప్పుడు దర్యాప్తును తిరిగి ప్రారంభించారు. ఆ శవం ఎవరిదో వెదితే పనిలో పడ్డారు.