గుజరాత్ లో రూ.5 వేల కోట్ల కొకైన్ సీజ్

గుజరాత్ లో రూ.5 వేల కోట్ల కొకైన్  సీజ్

న్యూఢిల్లీ: మరో డ్రగ్స్  రాకెట్ ను ఢిల్లీ, గుజరాత్  పోలీసులు ఛేదించారు. గుజరాత్ లో అంకాలేశ్వర్  నగరంలోని ఓ ఫార్మాస్యూటికల్  కంపెనీలో దాచి ఉంచిన 518 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇరు రాష్ట్రాల పోలీసులు ఉమ్మడి ఆపరేషన్  చేపట్టి ఈ రాకెట్ ను ఛేదించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్  విలువ రూ.5 వేల కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. 

కాగా, రెండు వారాల క్రితం కూడా ఢిల్లీ, గుజరాత్  పోలీసులు ఉమ్మడి కార్యాచరణ చేపట్టి రూ.13 వేల కోట్ల విలువైన 1289 కిలోల కొకైన్, 40 కిలోల గంజాయిని సీజ్  చేశారు. థాయ్ లాండ్  నుంచి ఆ సరుకును స్మగ్లింగ్  చేస్తుండగా పట్టుకున్నారు.