గుజరాత్లో ప్రైవేట్ స్కూల్ కు బాంబు బెదిరింపులు..సెలవు ప్రకటించిన మేనేజ్మెంట్

గుజరాత్లో ప్రైవేట్ స్కూల్ కు బాంబు బెదిరింపులు..సెలవు ప్రకటించిన మేనేజ్మెంట్

గుజరాత్ లోని వడోదరలో ఓ ప్రైవేట్ పాఠశాలకు బాబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ( జనవరి24, 2025) తెల్లవారు జామున 4 గంటలకు స్కూల్ క్యాంపస్ పేల్చివేస్తామని బెదిరింపు ఈమెయిల్స్ పంపించారు గుర్తుతెలియని వ్యక్తులు. సమాచారం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం సెలవు ప్రకటించి విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేశారు. 

స్కూల్ కు బాంబు బెదిరింపులపై దర్యాప్తు కొనసాగుతోంది. స్కూల్ భవనం మొత్తం శానిటైజ్ చేయించారు. సైబర్ సెల్ ఈమెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవరు పంపించారు అనేక కోణంలో విచారణ చేపట్టారు.  విచారణలో వెల్లడి అయ్యే విషయాలను బట్టి చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.