
- గుజరాత్ ప్రిన్సిపల్ సెక్రటరీ రమేశ్ చంద్ మీనా ప్రశంస
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సివిల్సప్లయ్స్ డిపార్ట్మెంట్ అమలు చేస్తున్న పథకాలను గుజరాత్ స్టేట్ సివిల్ సప్లయ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రమేశ్ చంద్ మీనా అభినందించారు. మంగళవారం ఆయన రాష్ట్ర సివిల్సప్లయ్స్ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్చౌహాన్తో కలిసి హైదరాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా పంజాగుట్ట ఏజీ కాలనీలోని రెండు జన్ పోషణ్ కేంద్రాలను సందర్శించారు. రాష్ట్రం అవలంబిస్తున్న ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్(ఈపాస్) విధానాన్ని రమేశ్ చంద్ మీనా ప్రశంసించారు.
ఈ విధానం ద్వారా నిజమైన లబ్ధిదారులకు రేషన్పంపిణీ పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడాన్ని అభినందిం చారు. అనంతరం సివిల్సప్లయ్స్కార్యాలయంలో జరిగిన సమావేశంలో డీఎస్ చౌహాన్ సంస్థ కార్యకలాపాలను ఆయనకు తెలిపారు. ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాల అమలు తీరును వివరించారు. ప్రధానంగా కొనుగోలు సెంటర్ల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరణ, సన్న వడ్లకు రూ.500 బోనస్, రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీని రమేశ్ చంద్ మీనా ప్రశంసించారు. ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బియ్యం ఎగుమతి చేయడం చారిత్రాత్మకమని రమేశ్చంద్ మీనా పేర్కొన్నారు.