ధర్మం అంటే ఇదేనా : 27 ముస్లిం హోటల్స్ లైసెన్స్ రద్దు చేసిన గుజరాత్ ఆర్టీసీ

ధర్మం అంటే ఇదేనా : 27 ముస్లిం హోటల్స్ లైసెన్స్ రద్దు చేసిన గుజరాత్ ఆర్టీసీ

ఆర్టీసీ అంటే అందరి బస్సు... ధనిక పేద, కుల మత, వర్గ వర్ణ బేధాలు లేకుండా అందరికీ సేవలందించే సంస్థగా ఆర్టీసీని భావిస్తాం. పైగా ఇది మనందరి బస్సు, దీనిని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అంటూ ఆర్టీసీ బస్సుల్లో స్లోగన్లు కూడా రాసి ఉంటాయి. అలాంటి ఆదర్శవంతమైన ఆర్టీసీ మత పరంగా వివక్ష చూపింది.. అవును నిజం, గుజరాత్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. గుజరాత్ లో 27 ముస్లిం హోటళ్ల లైసెన్స్ ను రద్దు చేసింది ఆర్టీసీ. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

హిందూ పేర్లతో లైసెన్సులు తీసుకొని ముస్లిం యాజమాన్యాలు నడుపుతున్న హోటల్స్ ను గుర్తించిన గుజరాత్ ఆర్టీసీ.. ఇకపై సదరు హోటళ్ల దగ్గర ఆర్టీసీ బస్సులను ఆపొద్దంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. గుజరాత్ ఆర్టీసీ బహిష్కరించిన 27 హోటళ్ల జాబితాలో వడోదర, రాజ్‌కోట్, గోద్రా, మెహసానా, భుజ్, బరూచ్, అహ్మదాబాద్, నదియాడ్, పాలన్‌పూర్ మొదలైన డివిజన్‌లలోని హోటళ్లు ఉన్నాయి. ఈ 27 హోటళ్లు హిందూ దేవతల పేర్లతో నడుపుతున్నట్లు సమాచారం.

ఈ జాబితాలో భుజ్-ధ్రగంధ్ర-అహ్మదాబాద్ మార్గంలో ఉన్న హోటల్ శివశక్తి, సూరత్-అహ్మదాబాద్ మార్గంలో ఉన్న హోటల్ తులసి వంటి హోటళ్లు.. హిందువుల పేర్లతో లైసెన్సులు తీసుకొని.. ముస్లిం యాజమాన్యాల చేత నడపబడుతున్నట్లు తెలిపింది గుజరాత్ ఆర్టీసీ.