GT vs RCB: సాయి సుదర్శన్ ఒంటరి పోరాటం.. బెంగళూరు ముందు భారీ లక్ష్యం

GT vs RCB: సాయి సుదర్శన్ ఒంటరి పోరాటం.. బెంగళూరు ముందు భారీ లక్ష్యం

ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు మరోసారి తేలిపోయారు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ పై జరుగుతున్న మ్యాచ్ లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పవర్ ప్లే లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా ఆ తర్వాత బౌలర్లు గాడి తప్పారు.  సాయి సుదర్శన్( 49 బంతుల్లో 84, 8 ఫోర్లు, 4 సిక్సులు) ఒంటరి పోరాటానికి తోడు షారుఖ్ ఖాన్ (30 బంతుల్లో 5 సిక్సులు, 3 ఫోర్లతో 58) మెరుపులతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు భారీ స్కోర్ చేసింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ కు తొలి ఓవర్లోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ సాహా 4 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో గిల్, సాయి సుదర్శన్ పరుగులు చేయడానికి తడబడ్డారు. బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లే లో కేవలం 42 పరుగులు మాత్రమే వచ్చాయి. క్రీజ్ లో ఉన్నంత సేపు తడబడ్డ గిల్ 19 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా షారుక్ పవర్ హిట్టింగ్ తో బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు. 

24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసుకున్న షారుక్ 30 బంతుల్లో 5 సిక్సులు, 3 ఫోర్లతో 58 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో విఫలమయ్యాడు. చివర వరకు క్రీజ్ లో సాయి సుదర్శన్, మిల్లర్ (26) తో కలిసి జట్టు స్కోర్ ను 200 పరుగులకు చేర్చాడు. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్, సిరాజ్, మ్యాక్స్ వెల్ తలో వికెట్ తీసుకున్నారు.