IPL 2025: ఐపీఎల్ వదిలి.. అర్ధాంతరంగా స్వదేశానికి వెళ్లిన వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్

IPL 2025: ఐపీఎల్ వదిలి.. అర్ధాంతరంగా స్వదేశానికి వెళ్లిన వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్

సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబడా ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. తొలి రెండు మ్యాచ్ లాడిన ఈ సఫారీ పేసర్ బుధవారం (ఏప్రిల్ 2) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ కు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల వలన రబడా ఈ మ్యాచ్ కు దూరమైనటు తెలుస్తుంది. దీంతో అతను ఐపీఎల్ ను వదిలి అర్ధాంతరంగా సౌతాఫ్రికా వెళ్ళిపోయాడు. వ్యక్తిగత ఎమర్జెన్సీ కారణంగా రబడా వెళ్లినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. 

రబడా ఎప్పుడు జట్టులో చేరతాడనే విషయంలో స్పష్టత లేదు. అతను ఏప్రిల్ 6 న సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరగబోయే మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రబడా లాంటి టాప్ క్లాస్ బౌలర్ లేకపోవడం గుజరాత్ కు పెద్ద దెబ్బే. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో రబడా స్థానంలో అర్షద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ సఫారీ ఫాస్ట్ బౌలర్ దూరం కావడంతో గుజరాత్ ముగ్గురు ఫారెన్ ప్లేయర్లతోనే ఆడింది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో గుజరాత్ టైటాన్స్ రూ.10.75 కోట్ల రూపాయలకు రబడాను దక్కించుకుంది. 2024 ఐపీఎల్ సీజన్ లో రబడా పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. 

Also Read :  టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

రబడా లేకపోయినా గుజరాత్ ఆర్సీబీపై ఘన విజయం సాధించింది. ఐపీఎల్ లో తొలి మ్యాచ్ తర్వాత బ్యాటర్లకు అనుకూలంగా మారుతున్న తయారు చేస్తున్న పిచ్, రూల్స్ పై సౌతాఫ్రికా స్టార్ ఫాస్ట్ బౌలర్ కాగిసో రబడా ఆందోళన వ్యక్తం చేశాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ తర్వాత బంతికి, బ్యాట్ కు మధ్య సమతుల్యత ఉండాలని సూచించాడు. ఆటగాళ్లకు వినోదాన్ని పంచడానికి ప్రతి మ్యాచ్ లో ఫ్లాట్ వికెట్ తయారు చేయకూడదని.. మనం ఆడే ఆటకు క్రికెట్ బదులు బ్యాటింగ్ అనే పెట్టవచ్చని రబడా అన్నాడు.