ఐపీఎల్ లో గుజరాత్ జట్టులోని ప్లేయర్లను టార్గెట్ చేశారు ఫ్రాంచైజీలు. ఓ వైపు ఆ జట్టు హార్దిక్ పాండ్య లేని లోటుని భర్తీ చేసే పనిలో ఉంటే మరో వైపు గుజరాత్ స్టార్ పేసర్ మహమ్మండ్ షమీ మీద ఫ్రాంచైజీ కన్ను పడింది. గుజరాత్ ఫ్రాంచైజీ యొక్క చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) కల్నల్ అరవిందర్ సింగ్ తమ స్టార్ పేసర్ మహమ్మద్ షమీని ఒక ఫ్రాంచైజీ నేరుగా సంప్రదించినట్లు పేర్కొన్నారు.
న్యూస్ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గుజరాత్ టైటాన్స్ COO సింగ్.. జట్ల ఫ్రాంచైజీలు నేరుగా ఆటగాళ్లను సంప్రదించడం పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేసాడు. "ప్రతి ఫ్రాంచైజీకి అగ్రశ్రేణి ఆటగాళ్ల కోసం వెళ్ళే హక్కు ఉంటుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ నేరుగా ఆటగాడిని సంప్రదించడం తప్పు. ఆటగాళ్ల ట్రేడింగ్ విషయంలో BCCI రూల్స్ పెట్టి అవి అమలయ్యేలా చూడాలి. వారు బదిలీ కావాలనుకుంటే వారు మాతో ముందుగానే మాట్లాడవచ్చు". అని కల్నల్ అరవిందర్ సింగ్ తెలిపాడు.
గుజరాత్ జట్టులో షమీ ఎంత కీలక ప్లేయర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2023 ఐపీఎల్ సీజన్ లో షమీ టోర్నీ అంతటా అద్భుతమైన బౌలింగ్ చేసి 17 మ్యాచ్ ల్లో 28 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఇక ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో 24 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.
2023 నవంబర్ నెలలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను విడిచి పెట్టి ముంబై ఇండియన్స్‌తో చేరిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ట్రాన్స్‌ఫర్‌ను రెండు ఫ్రాంచైజీలు పూర్తి చేశాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ఇందులో భాగం పంచుకుంది. ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ కామెరూన్ లీగ్ (రూ. 17.5 కోట్లు)ను ఆర్‌సీబీకి ట్రేడ్ చేయడం ద్వారా వచ్చిన డబ్బులతో ముంబై ఇండియన్స్ పాండ్యాను కొనుగోలు చేసింది.
Gujarat Titans' COO said, "it's wrong to contact players directly for IPL trade. Teams should follow the protocols set by the IPL and BCCI". (News18). pic.twitter.com/i0qFgovEXV
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 6, 2023